‘రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం. వాటి కోసం గళం విప్పండి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే’అని, దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ‘అమరావతిలో పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు’అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.