గత 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ రోగ్యాన్నిపరిరక్షించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. “సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన వైద్యపరమైన చర్యలన్నీ చేపట్టాలి,” అని గురువారం ఉదయం కోర్టు ఆదేశించింది. దీక్షను విరమించకపోతే రాబోయే 48 గంటల్లో వాంగ్‌చుక్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వాంగ్‌చుక్ మరణం “దేశానికి మరియు ప్రపంచానికి అత్యంత అవమానకరమైన విషయం” అవుతుందని కూడా ఆ పిటిషన్‌లో వాదించారు.