<span;>ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుండానే దీక్షను విరమిస్తే అది తప్పు సంకేతాన్ని పంపినట్లవుతుందని సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ జవాబుదారీతనం ఉండాల్సిందేనని, అందుకే తాను వెనక్కి తగ్గబోనని చెప్పారు. పలువురు స్వయంగా వచ్చి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారని వాంగ్‌చుక్ చెప్పారు. కొందరు తనతో బలవంతంగా ఆహారం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కూడా ఆశ్రయించినట్లు వెల్లడించారు.జూలై 20న నిర్వహించనున్న ‘చలో సంసద్’ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు.