కర్ణాటక ధార్వాడ్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 45 ఏళ్ల అనస్థీషియా వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడూ కత్తి పోట్లతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.మృతుడి భార్య, వృత్తిరీత్యా కంటి వైద్యురాలు అయిన డాక్టర్ ప్రియాంక ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కిరణ్ మృతికి ప్రియాంకే కారణమని బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ, పోలీసులు ఇంకా నిర్ధారించలేదుప్రస్తుతం ప్రియాంక షాక్‌లో ఉన్నారని, విచారణలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని పోలీసులు తెలిపారు.