కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. బుధవారం ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి, ఆయన అనుచరులు పోలీసులను తోసేసిన సంగతి తెలిసిందే. ఉన్నతాధికారుల ముందే తోసేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఏఆర్ ఎస్ఐ అప్పలరాజు కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అంబటిపై కేసు నమోదు చేశారు