అంతర్జాతీయ వాతావరణ మార్పులు, సూపర్ ఎల్-నినో తీవ్ర ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో రుతుపవనాలు ఊపందుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. గత మే నెలలో సగటున 9.26 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు, ప్రస్తుతం మరింత దిగజారి 9.47 మీటర్ల రికార్డు స్థాయికి పడిపోవడం పట్ల పర్యావరణ వేత్తలు, అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.