గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై ఎయిర్ పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్లింగ్ కాంట్రాక్టు విషయంల టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణల్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్లింగ్ కాంట్రాక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పేరును రాజకీయంగా దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు.కాంట్రాక్టు విలువ రూ.300 కోట్లని పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ ను కూడా చంద్రబాబుకు పంపారు.