అడ్డగూడూరుకు చెందిన చైతన్య ఓ బాలిక ఇంట్లో చొరబడి ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. పోలీసులు చైతన్యపై పోక్సో కేసు నమోదు చేశారు. కానీ, నిందితుడిని రిమాండ్ కు తరలించకుండా పోలీసులు బెయిల్ పై విడుదల చేశారు. దీంతో చైతన్య విడుదలైన వెంటనే బాధిత బాలికను కిడ్నాప్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చైతన్య కోసం కూడా వెతుకుతున్నారు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు? అసలు ఆ బాలికను చైతన్యే తీసుకెళ్లాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.