ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై వ్యక్తమవుతున్న ఆందోళనపై చర్చించేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. ఒకవేళ మాట్లాడేందుకు అవకాశం ఇస్తే ఈ20 పెట్రోల్ కు సంబంధించిన సాంకేతిక సమస్యలను, ప్రజల నుంచి తనకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను మోదీకి వివరిస్తానని పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల్లో ఈ20 పెట్రోల్ తోపాటు, స్వచ్ఛమైన పెట్రోల్ ను కూడా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ20 పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.