ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున అందిస్తామని కేకే రాజు చెప్పారు. ఈ డబ్బును వైఎస్సార్సీపీ తరఫున అందిస్తామని అన్నారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్నా కుటుంబానికి రూ.7 లక్షల సాయం చేస్తామని చెప్పారు.