బోటు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు సర్కార్ ఎందుకు స్పందించలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు.కేవలం పది మైళ్ల దూరంలోనే ఘటన జరిగింది. బోటు ప్రమాదం జరిగిందని రాత్రి 10:30కి కలెక్టర్, మెరైన్ సీఐకి మెసేజ్ పెట్టారు. వెంటనే స్పందిస్తే గంటల్లోనే మత్స్యకారులు దొరికేవారు.వెంటనే కోస్ట్ గార్డ్ వచ్చి ఉంటే ఐదుగురైనా బతికేవారు. తప్పుడు జరిగింది కాబట్టే త్రీమెన్ కమిటీ వేశారు. బాధితుల వద్దకు మంత్రులను పంపాలని సీఎంకు తెలియదా?. చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం ఉందా?” అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.