ACB అధికారులు మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగాయి. నగరంలోని మైత్రివనంలో గల హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంతో పాటు, గచ్చిబౌలిలోని సుమధుర టవర్స్‌లో ఉన్న రవీందర్ నివాసంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ముఖ్య స్నేహితులు, సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో భారీగా విలువైన స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.