పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడిలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. పెద్దపల్లి పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ఎంబీ రికార్డు నమోదు చేసి, బిల్లులు క్లియర్ చేయడానికి ఏఈ సతీష్ ఆ కాంట్రాక్టర్‌ను భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి, కాంట్రాక్టర్ నుంచి ఏఈ సతీష్ లంచం నగదు తీసుకుంటుండగా అధికారులు అప్రమత్తమై రెడ్ హ్యాండెడ్‌గా అతనిని పట్టుకున్నారు.

