బద్రీనాథ్ ఆలయ విరాళాల నిధుల అవకతవకల ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణకు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే బద్రీనాథ్ ధామ్ ఆఫరింగ్, డొనేషన్ మాజీ అధికారి ప్రమోద్ నౌటియాల్‌ను సిట్ అరెస్టు చేసింది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో డెహ్రాడూన్‌లో ప్రమోద్ను అరెస్టు చేసింది. అనంతరం ప్రమోద్ను బద్రీనాథ్‌కు తీసుకువచ్చారు. అయితే ఈ కేసులో ప్రమోద్ నౌటియాల్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.