మాట తప్పడం, పార్టీలు మారడం రేవంత్ రెడ్డి సంస్కృతి అని.. తనది కాదని తమ ఇద్దరి రాజకీయ చరిత్రే దీనికి నిదర్శనమన్నారు. “రేవంత్ రెడ్డిలా ఒట్టు వేసి ఓ మాట.. వేయకుండా ఓ మాట చెప్పను. భద్రాద్రి రాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి.. కనీసం ఖమ్మం జిల్లాలోనైనా రుణమాఫీ చేశారా? ఎందుకంత ఆవేశం, అసహనంతో రగిలిపోతున్నారు రేవంత్ రెడ్డి? అన్నదాతల శాపం నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకోలేదు” అని హరీశ్ రావు అన్నారు.

