పోక్సో కేసులో అరెస్టు అయిన బండి సాయిభగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయోద్దని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మే 8వ తేదీన పోక్సో కేసు నమోదు కావడంతో పరారయ్యాడు. సుచిత్రకు చెందిన మహిళ తన కూతురిపై సాయి భగీరథ్ లైంగికంగా హింసించాడన్న ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.