అర్జెంటీనా లోని టొలెడాలో ఫ్లయింగ్ ప్యారెట్ కార్డోబా ఫ్లయింగ్ స్కూల్లో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న లియాండ్రో ఆండ్రెస్ .. ఓ విద్యార్థికి ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో అకస్మాత్తుగా విమానం నుంచి దూకేశారు. ‘ఏం చేయాలో నీకు తెలుసు. ఆ ప్రకారమే నడుచుకో’ అంటూ ఇన్స్ట్రక్టర్ తన హెడ్సెట్, సీట్‌బెల్ట్ తీస్తూ ఆ స్టూడెంట్‌కు చెప్పారు. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించని ఆ యువకుడు తొలుత కంగుతిన్నా తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు.