ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ అణుఇంధనం, రక్షణ, కీలక ఖనిజాలు, ఇండో-పసిఫిక్ భద్రత తదితర రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరినట్లు ప్రకటించారు. అలాగే ఆస్ట్రేలియా- భారత్ భాగస్వామిని క్రికెట్‌తో పోల్చారు.
భారత్-ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రికెట్ ఒక దౌత్య భాషలా మారిందన్నారు. నిర్ణయాలు టీ20 మ్యాచ్‌లా వేగంగా ఉంటాయని, ఇరు దేశాల భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్‌లా దీర్ఘకాలికంగా, బలంగా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.