ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో కలిసి చారిత్రక ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ ప్రంబనన్ దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. తొమ్మిదో శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఇండోనేషియా జావా ద్వీపంలో ఉందీ ఆలయం. ప్రధాన శివాలయం దాదాపు 47 మీటర్ల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉంటుంది. నిర్మాణ శైలి నాటి భారత వాస్తుకళను పోలి ఉంటుంది. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ మహాకావ్యానికి సంబంధించిన కథా శిల్పాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.