ఏపీకి చెందిన ఇద్దరు కాలేజీ విద్యార్థులు కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మల్లాళ్లి జలపాతంలో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆపరేషన్ సురక్షితంగా రక్షించారు. గణేష్, సంతోష్ స్నేహితులతో బారికేడ్లను దాటి వారు నీటిలోకి దిగారు. అదే సమయంలో ఎగువన ఉన్న పవర్ ప్లాంట్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. ఆ ఇద్దరు యువకులు దాదాపు గంటకుపైగా నీటి మధ్యలో బండరాయిని పట్టుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడారు.