కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ వెన్నుపూస లాంటిదని.. అదే విరిగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్లానింగ్, డిజైన్, ఆపరేషన్స్ మొత్తం లోపాలే ఉన్నాయని పేర్కొన్నారు. మేడిగడ్డ నిర్మించిన ప్రాంతమంతా ఇసుకతో నిండిపోయి ఉందని, అక్కడ బ్యారేజీలు కడితే నిలవవన్నారు. అదే విషయాన్ని ఇంజినీర్లు చెప్పినా కేసీఆర్ వినిపించుకోకుండా కట్టేశారన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అలా చేస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందన్నారు.