బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను బంద్రాలోని నివాసంలో వివాహం చేసుకున్నారు. గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న అమిర్.. గౌరీతో రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అమిర్‌కు ఆమెతో 25 ఏళ్లకు పైగా స్నేహముంది. మరోవైపు గౌరీకి కూడా గతంలో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె విడాకులు తీసుకున్నారు. అమిర్ కుమారుడు జునైద్ ఖాన్, ఆజాద్ రావ్ ఖాన్, కుమార్తె ఇరా ఖాన్‌తో పాటు గౌరీ స్ప్రాట్ తనయుడి సమక్షంలో వివాహ వేడుక జరిగింది.