జమ్మూ కశ్మీర్ లోని పండ్ల తోటలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్ జిల్లాలోని పండ్ల తోటలో అమర్చిన సీసీ కెమెరాలో ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించిన సైన్యం అప్రమత్తమైంది. తోటకు ఉన్న అన్ని మార్గాలు మూసేసి.. సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందాలు ఉగ్రవాదులు కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.