నీళ్లున్నా ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌజ్ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ బృందాన్ని జనగాం జిల్లా పెంబర్తి వద్ద బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.