అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక కూడా పెట్టలేదని మండిపడ్డారు. తాము వచ్చాకే, రాజధాని నిర్మాణం సహా అన్ని రకాల పనులు జరుగుతున్నాయని వివరించారు. విశాఖతో పాటు ఇక నుంచి రాయలసీమ ఉక్కు ప్రాంతంగా మారబోతుందన్నారు. తీవ్రవాదులతో పోరాడిన చరిత్ర తనకు ఉందని, అలిపిరిలో తన కారుపై బాంబు బ్లాస్ట్ జరిగితే.. వేంకటేశుడే తన ప్రాణాలు రక్షించాడని వివరించారు.