ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ మ్యాచ్ మొరాకో చేతిలో ఓడిపోయిన నెదర్లాండ్స్ జట్టుకు ఆన్ లైన్లో లో ఘోర అవమానం ఎదురైంది. పెనాల్టీ షూటౌట్లో తప్పు చేసిన ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అసహ్యకరమైన రేసిజం వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ దారుణమైన చర్యను డచ్ ఫుట్ బాల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ రేసిజం వ్యాఖ్యలపై ఆన్లైన్ వివక్ష నిరోధక విభాగానికి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు బోర్డు తెలిపింది.

