తెలంగాణలో ఓ జర్నలిస్ట్, యూట్యూబర్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్స్ ఖాతాలను మెన్షన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రశ్నించే వాళ్ల గొంతుకలను నొక్కడం పిరికితనమేనని విమర్శించారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా అన్యాయం అన్యాయమేనని, దానికి ప్రజలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత అని ప్రకాశ్ రాజ్ తన పోస్టులో పేర్కొన్నారు.