కృష్ణా-ఎన్టీఆర్ జిల్లా బీబిగూడెం వద్ద వేగంగా వెళ్తున్న ఒక భారీ కంటైనర్, ట్యాంకర్ మధ్యలో కారు ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. రెండు భారీ వాహనాలు బలంగా ఢీకొట్టడంతో వాటి మధ్యలో ఉన్న కారు పూర్తిగా నలిగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నాలుగు సంవత్సరాల చిన్నారి కూడా ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కారు ముందు వెళ్తున్న ఒక బైక్‌ను సైతం ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.