ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ దేశం అత్యున్నత గౌరవ పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ ప్రదానం చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యల్లో ఆయన చూపుతున్న నాయకత్వం, చిన్న ద్వీప దేశాల అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించింది. విదేశాల నుంచి ప్రధాని మోదీ అందుకున్న 34వ అంతర్జాతీయ పురస్కారం ఇదే. సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి వ్యక్తి ప్రధాని మోదీ కావడం విశేషం