తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ఉద్యమ ఆశయాలు ఇంకా నెరవేరలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. తెలంగాణ వేగవంతమైన అభివృద్ధిని సాధించేందుకు ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఏర్పాటుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం తెలంగాణకు వచ్చారు. ఈ సందర్బంగా రంగారెడ్డి రూరల్ బీజేపీ
కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలోని 8 బీజేపీ కార్యాలయాలను నితీన్ నబీన్ వర్చువల్గా ప్రారంభించారు.