ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి పండించే రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్ర రైతులకు అండగా నిలవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం ఒక లేఖ రాశారు. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల వల్ల మ్యాంగో పల్ప్ (మామిడి గుజ్జు) ఎగుమతులు నిలిచిపోయాయని, దీని ప్రభావం స్థానిక మార్కెట్‌పై తీవ్రంగా పడిందని ఆయన లేఖలో వివరించారు.