ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టుకు ఆత్మీయ స్వాగతం లభించింది. బెల్‌ఫాస్ట్‌లోని భారత కాన్సులెట్ జనరల్ కార్యాలయం టీమిండియా స్క్వాడ్‌ను ఆహ్వానించింది. బెల్‌ఫాస్ట్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఆదివారం సాయంత్రం భారత క్రికెటర్ల బృందం..కోచింగ్ సిబ్బంది వెళ్లారు. కాన్సులేట్ జరనల్ కిరణ్ ఖత్రీ వీరికి అపూర్వ స్వాగతం పలికారు. ఆద్యంతం కోలాహలంగా సాగిన ఈ కార్యక్రమంలో ఐర్లాండ్‌లోని ప్రవాస భారతీయులు, విశిష్ట అతిథులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ఫోటోలను బీసీసీఐ ఎక్స్ పోస్ట్‌లో పంచుకుంది.