రాష్ట్ర జలహక్కులపై సిఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ట్రిబ్యునల్, అపెక్స్ లేకుండానే దొడ్డి దారిన ఒప్పందాలు జరిగాయని అన్నారు. మన జలహక్కులకు ప్రమాదమని తెలిసినా రేవంత్ వత్తాసు పలుకుతున్నారని, ఎపి, కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల కోసం తెలంగాణ జలహక్కుల తాకట్టు సర్కార్ కుట్రని విమర్శించారు. తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభోత్సవంలో రేవంత్ రహస్య ఒప్పందం అని జలహక్కుల పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.