మార్కాపురం ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని, వెలిగొండ ప్రాజెక్టు వస్తే బాగుంటుందని దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ ఆలోచించారని ఎపి సిఎం తెలిపారు. తాను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా వెలిగొండ గురించే అడిగేవారని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన వారి త్యాగాలు వృథా పోవని అన్నారు. 2,350 మంది నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నామని, గతంలో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా ఇచ్చామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి నక్సలిజం అడ్డుగా ఉండకూడని నక్సలిజం అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు.