ఈ ఏడాది జూన్ 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న రైతులందరూ తప్పనిసరిగా జులై 5 లోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డ్, కొత్త పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ ఖాతా మొదటి పేజీ జిరాక్స్ ప్రతులతో పాటు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారాన్ని సంబంధిత ప్రాంతీయ వ్యవసాయ విస్తరణాధికారులకు (AEO) స్వయంగా అందజేయాల్సి ఉంటుంది.