శుక్రవారం సచివాలయంలోని RTGS కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి నారా లోకేశ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చే ‘డేటా లేక్’ ప్రాజెక్టు పనులను రాబోయే జులై నాటికి పూర్తి చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు గడువు విధించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని, రేషన్ కార్డుల విభజన, పేర్ల చేర్పులు మరియు తొలగింపుల ప్రక్రియను వీలైనంత సరళతరం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.