దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలోని మిండానో సమీపంలో 6.7 తీవ్రతతో శుక్రవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, మిండనో ద్వీపంలోని సరంగాని పట్టణానికి నైరుతి దిశలో సుమారు 21 కిలోమీటర్ల దూరంలో, 65.7 కిలోమీటర్ల (41 మైళ్ల) లోతులో భూకంపం సంభవించింది. ఎక్కడి కక్కడ భవనాలు నెలకూలాయి. పెద్ద పెద్ద అపార్ట్ మెంట్ భవంతులు పేకమెడల్లా కూలిపోయాయి. వెంటనే ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ భూకంప ప్రభావంకు సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది.