జపాన్‌లో మరో భూకంపం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి టోక్యో సమీపంలో భారీ భూకంపం సంభవించింది. టోక్యోకు పశ్చిమాన ఉన్న యమనషి ప్రిఫెక్చర్‌లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ భూకంపం కారణంగా టోక్యో, షిజువోకా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలను నిలిపివేసినట్లు టోకైడో షింకన్‌సెన్ బుల్లెట్ రైలు నిర్వాహకులు తెలిపారు.అణు విద్యుత్ కేంద్రాల వద్ద ఎటువంటి అసాధారణ పరిస్థితులు నమోదు కాలేదని నిర్వాహకులు తెలిపారు.