బిగ్బాస్ లో అవకాశం ఇవ్వాలంటూ పోలీస్ యూనిఫాంలో ఎస్సై నాగార్జున రెడ్డి వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి ఏకంగా ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ధృవీకరించారు అధికారిక యూనిఫాం ధరించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వినోద కార్యక్రమాల ఆడిషన్ల కోసం సోషల్ మీడియాలో వీడియోలు చేయడం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం కిందికి వస్తుంది. ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ రియాలిటీ షోలో పాల్గొనాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి.