అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య భూమి కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు పెట్టుకుటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ గ్రామంలో ఆయనకు 600 గజాల నివాస స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు భూమి పత్రాలుఅందజేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనే కనీస గౌరవం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.