గుజరాత్‌లోని రాజ్‌కోట్ లో ఆప్ పార్టీ మాజీ అభ్యర్థిని, అగమన్ రెసిడెన్సీలోని ఒక ఇంట్లో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది ఇది ఆత్మహత్య కాదని, ముందస్తు ప్రణాళిక హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నందిని బోస్మియా అస్లాం సమా అనే వ్యక్తితో సహజీవనం ఒప్పందం ద్వారా ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అస్లాం సమాకు ఇదివరకే వివాహం కాగా.. అతను, అతని మొదటి భార్య, అత్తమామలు కలిసి నందినిని నిరంతరం శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, తీవ్రంగా కొట్టేవారని సోదరి ఆరోపించారు.