ఫ్రాన్స్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో భారతీయ సినిమా ఖ్యాతి మరోసారి వెలిగిపోయింది. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న సరికొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’. ఈ చిత్రం ఈ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన Work in Progress ప్యానల్ డిస్కషన్‌కు అధికారికంగా ఎంపికవడంతో చిత్ర యూనిట్ అంతా అక్కడ హాజరైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలను, యానిమేషన్ రంగంలో తాము తీసుకుంటున్న జాగ్రత్తలను అంతర్జాతీయ ప్రతినిధులతో పంచుకున్నారు.

