విజయవాడ సాయికృష్ణ కేసులో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై జొన్నగిరి సభలో సీఎం చంద్రబాబు స్పందించారు. కులం, మతం, ప్రాంతాల వారీగా ప్రజల్ని విడగొట్టాలని గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సాయికృష్ణ కేసులో కులం కార్డును ఉపయోగించి పవన్ కళ్యాణ్ ను బద్నాం చేయాలని వైసీపీ ప్రయత్నించిందని మండిపడ్డారు. ఆ కేసులో సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడేనని .. ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఖబడ్డార్ జాగ్రత్త.. అనవసరంగా నోరు పారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీయేకు ఉందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.