ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన నాటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెలలో మషాద్ లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీ హాజరవుతారా లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ కు సుదీర్ఘకాలం సుప్రీం లీడర్ గా ఉన్నారు. దశాబ్దాలుగా ఆ ఇరాన్ విదేశీ విధానాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.