ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 11 వేల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా, వారి గ్రాట్యుటీ పరిధితో కూడిన ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2004 నోటిఫికేషన్ కంటే ముందుగా ఉద్యోగ నియామక ప్రక్రియలు పూర్తయి, ఆ తర్వాత విధుల్లో చేరిన సిబ్బంది అందరికీ పాత పెన్షన్ విధానాన్ని (OPS – Old Pension Scheme) వర్తింపజేయాలని నిర్ణయించింది. పాత పెన్షన్ విధానం అమల్లోకి రావడం వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత స్థిరమైన పెన్షన్ ఆదాయం లభిస్తుంది.