ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు.. రికార్డు సమయంలో తుంగభద్ర డ్యామ్ జలాశయానికి ఉన్న మొత్తం 33 క్రెస్ట్ గేట్లను అత్యంత విజయవంతంగా పునరుద్ధరించాయి.జూన్ 25న మునిరాబాద్ కొప్పల్ వద్ద నిర్వహించబోయే తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవ వేడుక కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అధికారికంగా ఆహ్వానించేందుకు కర్ణాటక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం ఏపీ సచివాలయానికి వచ్చింది.