తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ తన నామినేషన్ను తిరస్కరించడం వెనుక కేంద్ర ఎన్నికల సంఘం దుర్మార్గమైన పద్ధతిలో వ్యవహరించిందని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ అన్యాయంపై తాను వెనక్కి తగ్గేదే లేదని, త్వరలోనే అన్ని విషయాలను మీడియా ముఖంగా బహిర్గతం చేస్తానని స్పష్టం చేస్తూ.. కేవలం రాజకీయ వేదికలపైనే కాకుండా.. చట్టపరంగా కూడా ఈ అంశాన్ని తేల్చుకుంటానని మీనాక్షీ నటరాజన్ ప్రకటించారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు.