రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిజెపితో సిఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ మరోమారు బట్టబయలు అయిందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో..ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగె కుటుంబానికి కెటిఆర్ పరామర్శించారు పాండురంగె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రైతు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పంట కొనుగోలు చేయలేదని నెల రోజులు పడిగాపులు కాసి విసిగిపోయి రైతు పాండురంగె ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.