‘కుంభమేళా గర్ల్’ మోనాలిసాకు భద్రత కల్పించటంపై కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మోనాలిసా, ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్‌కు భద్రత కల్పించాలంటూ ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించింది. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ కేరళలోనే ఉంటున్నారు.ఫర్మాన్ తన కూతురిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని మోనాలిసా తండ్రి మధ్యప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మతాంతర వివాహం కారణంగా మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని మోనాలిసా తన పిటిషన్‌లో పేర్కొంది.