హాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన ‘ఫ్రెండ్స్’, ‘చీర్స్’ వంటి ఐకానిక్ అమెరికన్ సిట్‌కామ్‌ల దర్శకుడు జేమ్స్ బరోస్ కన్నుమూశారు. 85 ఏళ్ల బరోస్ శుక్రవారం రాత్రి నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో జేమ్స్ బరోస్ దాదాపు 1000కి పైగా టెలివిజన్ ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించి రికార్డు సృష్టించారు తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకు గానూ ఆయన ఏకంగా 11 ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నారు.